top of page

🤼‍♂️🎉 హైదరాబాద్‌లో తొలి WWE ఈవెంట్ పోటీ పడనున్న 28 మంది ఇంటర్నేషనల్ స్టార్స్...

హైదరాబాద్ క్రీడా అభిమానులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 8న వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) ఈవెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. 🏟️🤩 గచ్చిబౌలిలోని GMC బాలయోగి ఇండోర్ స్టేడియం "WWE సూపర్‌స్టార్ స్పెక్టాకిల్" ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ట్విట్టర్‌లో ప్రకటించారు. 📢👏 ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి విడుదల చేశారు.

ఈ ఈవెంట్‌లో ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ 'ఫ్రీకిన్' రోలిన్స్, మహిళల ప్రపంచ ఛాంపియన్ రియా రిప్లే, వివాదరహిత WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్ సమీ జైన్, కెవిన్ ఓవెన్స్‌లతో సహా కీలక WWE సూపర్‌స్టార్స్ హాజరవుతారని ఆయన తెలిపారు. ✨🏆 అలాగే WWE సూపర్‌స్టార్లు జిందర్ మహల్, వీర్, సంగ కూడా ఇందులో పోటీపడనున్నారు. ఈ ఈవెంట్ టిక్కెట్లు www.bookmyshow.comలో అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. 🎟️🤑

తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయగౌడ్‌ ఆదివారం ఈ ఈవెంట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. 🏆🇮🇳


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page