top of page

🚨 హైదరాబాదీలు బీ అలర్ట్‌.. జాగ్రత్తపడకపోతే డేంజర్‌లో పడ్డట్లే.. 🚨

🌆 హైదరాబాద్ నగరంలో ఇటీవల పీసీబీ డేటా ప్రకారం, 31 స్టేషన్స్ లో 15 స్టేషన్లలో 60 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా పీఎం 10 స్ధాయిలు నమోదయ్యాయి. 🚉

కోకాపేట పీఎం స్టేషన్‌లో పీఎం 2.5 స్ధాయిలు 40 కంటే ఎక్కువగా ఉన్నాయి. 💨 జీవ ద్రవ్యాన్ని కాల్చడం వల్ల వెలువడే గృహ వాయు కాలుష్యం శ్వాస కోశ వ్యాధులకు ప్రధాన కారణమని, దీనిపై జాగ్రత్తగా ఉండాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. 🌳 మరీ ముఖ్యంగా చలికాలంలో నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు.

🚗 చలికాలంలో గాలి పైకి పోకుండా పీల్చే స్ధాయిలోనే కాలుష్యంగా మారుతుందని.. దీనికి పెరుగుతున్న వాహనాలు, భవన నిర్మాణం, చెత్త కాల్చడం వంటివి ప్రధాన కారణమంటున్నారు. పర్యావరణ నిపుణులు. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో విపరీతంగా పెరిగిన పొల్యూషన్ అక్కడ నివాసించే వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అక్కడి పొల్యూషన్‌ని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నారు. అయితే భారత్ లో ఉన్న నగరాలతో పోలిస్తే సౌత్ ఇండియా హైదరాబాద్ 5వ స్ధానంలో ఉంది. 🏙️

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page