ప్రాణదాతలు జేజేలు అందుకోవాల్సింది పోయి.. రక్తంతో బిజినెస్ చేస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో ప్లాస్మా మాఫియా పాపం పండి నెత్తుటి చాటు నిజాలు బయటపడ్డాయి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణపై మత్తు మరక లేకుండా డ్రగ్ మాఫియా పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు.
ప్రాణదాతలు జేజేలు అందుకోవాల్సింది పోయి.. రక్తంతో బిజినెస్ చేస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో ప్లాస్మా మాఫియా పాపం పండి నెత్తుటి చాటు నిజాలు బయటపడ్డాయి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణపై మత్తు మరక లేకుండా డ్రగ్ మాఫియా పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. రీసెంట్‌గా నల్లగొండలో డ్రగ్ మాఫియాకు చెక్ పెట్టారు. శస్త్ర చికిత్సల్లో వాడే టాబ్లెట్లను.. ఇంజక్షన్లను నిబంధనలకు విరుద్ధంగా మత్తుబాబులకు అమ్మిసొమ్ము చేసుకుంటోన్న కేటుగాళ్లను కటకటాల బాటపట్టించారు. మత్తు మందుల గ్యాంగ్‌ల బెండు తీయడం మాత్రమే కాదు. మరో మార్పు కూడా మొదలైంది. ఆదాయానికి మించి ఆస్తులున్న అక్రమార్కుల భరతం పడుతోంది ఏసీబీ. ఏసీబీ విచారణలో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలక్రిష్ణ అక్రమాస్తుల కేసులో సంచలనం వెలుగుచూస్తున్నాయి. ఐతే అవినీతి తిమింగలు కోట్లకు కోట్లు మింగుతుంటే మరోవైపు సామాన్యుల రక్తం తాగుతోన్న అవినీతి జలగల బాగోతం తాజాగా తెరపైకి వచ్చింది. డ్రగ్ కంట్రోల్ దాడుల్లో బ్లడ్ బ్యాంక్‌ల్లో ఫ్లాస్మా మాఫియా నిర్వాకం బయటపడింది. ప్రాణాలను కాపాడే పవిత్ర వృత్తికి కళంకం తెస్తూ డబ్బు కోసం గడ్డి తింటున్నారు కొందరు కేటుగాళ్లు. బ్లడ్ బ్యాంక్‌ల ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్మాను సేకరించి.. అడ్డగోలు ధరలకు విక్రయిస్తున్న వైనం కలకలం రేపింది. పక్కా నిఘా పెట్టిన డ్రగ్ కంట్రోల్ అధికారులు పలు బ్లడ్ బ్యాంక్‌ల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. భారీగా ప్లాస్మా యూనిట్లను స్వాధీనం చేసుకున్నారు. సికిర ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్, న్యూలైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్.ఆర్ బ్లడ్ బ్యాంక్ సహా క్లిమెన్స్, క్లినోవి రీసెర్చ్, నవరీచ్ క్లినిక్, జీ7 ఎనర్జీ, క్యూపీఎస్ బయోసర్వీస్, శిల్ప మెడికల్, జెనీరైస్ క్లినిక్, వింప్టా ల్యాబ్‌లో నెత్తుటి చాటు దగానిజాలు బయటపడ్డాయి. పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఈ దందా ఎన్నాళ్ల నుంచి సాగుతోంది. ఈ రాకెట్ వెనుక ఇంకా ఎవరున్నారనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. 🚀✨