top of page
MediaFx

🚨 హైదరాబాద్‌లో ఐటీ ప్రాంతాల్లో ఆకతాయిల వీరంగం! 🚨

హైదరాబాద్‎లోని రాయదుర్గం మెట్రో, కేబుల్ బ్రిడ్జ్, టీ హబ్ లాంటి ప్రాంతాలు వీకెండ్ వస్తే చాలు ఆకతాయిలు బైక్ స్టంట్స్ చేస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు పనిచేసే ఈ ప్రాంతాలు వీకెండ్స్ కు నిర్మానుష్యంగా మారిపోతాయి. దీనిని ఉపయోగించి వికృత చేష్టలు చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఆకతాయిలు గుంపులుగా చేరి బైక్ రేసులు, స్టంట్లు చేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. వీడియోలు తీసి సోషల్ మీడియా లో పోస్టు చేస్తూ లైక్స్, కామెంట్స్ కోసం ప్రాణాలకు తెగిస్తున్నారు. తాజాగా పోలీసులు స్పందించి గస్తీ పెంచాలని నిర్ణయించారు. అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాలను సీజ్ చేసి ఆర్టీఏకు అప్పగిస్తామని అన్నారు. మైనర్లను పట్టుకుంటే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని సీఐ చెప్పారు.

bottom of page