top of page
Suresh D

నగరంలో ముగింపు దశకు చేరుకున్న గణేష్ నిమజ్జన ఘట్టం..

గణపతి ఉత్సవాలను దాదాపు 10 రోజుల పాటు ఘనంగా జరిపించుకున్న బుజ్జి గణపయ్య క్రమంగా గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నారు. గురువారం మొదలైన గణేష్ నిమజ్జన ఘట్టం ముగింపు దశకు చేరుకుంది.

భద్రప్రద శుక్లమాసం చవితి రోజున వినాయక చవితిగా గణపతి పుట్టిన రోజుని హిందువులు ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 18న వినాయక చవితి జరుపుకున్నారు. గణపతి ఉత్సవాలను దాదాపు 10 రోజుల పాటు ఘనంగా జరిపించుకున్న బుజ్జి గణపయ్య క్రమంగా గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నారు. గురువారం మొదలైన గణేష్ నిమజ్జన ఘట్టం ముగింపు దశకు చేరుకుంది. గురువారం వర్షం కారణంగా ఆలస్యమైన వినాయక విగ్రహాల నిమజ్జనం శుక్రవారం అర్ధరాత్రి దాటినా భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. అంతేకాదు శనివారం ఉదయానికి కూడా భారీ విగ్రహాలు నిమజ్జనం కోసం బారులు తీరారు. ఈసారి భారీగా విగ్రహలు ఏర్పాటు ఎక్కువగా చేయడంతో నిమజ్జనం ఆలస్యం అయిందని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.

నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎప్పుడు లేని విధంగా ఖైరతాబాద్ గణేష్ ను ముందుగా నిమజ్జనం చేసామని, నిమజ్జనం కోసం పనిచేసిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి, సిబ్బందికి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి నెక్లెస్ రోడ్డు, peoplez ప్లాజా లో ఉన్న విగ్రహల నిమజ్జనం జరిగింది.జియో టాకింగ్ లెక్కల ప్రకారం.. గ్రేటర్ లో రెండు రోజుల్లో 91,154 విగ్రహాలు నిమజ్జనం జరగగా, గురువారం 66,015 విగ్రహాలు చెరువులు, బేబీ పాండ్స్ లలో నిమజ్జనం జరగగా, శుక్రవారం 25,139 విగ్రహాలు నిమజ్జనం పూర్తి అయ్యాయి. గతేడాది కంటే ఈ ఏడాది 10 నుండి 15% ఎక్కువ విగ్రహాలు ఏర్పాటు చేశారు.

bottom of page