top of page
MediaFx

హమ్మయ్య.. ఇప్పటికి కల్కి షూటింగ్ పూర్తయింది..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కల్కి 2898AD సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. రోజురోజుకి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, బుజ్జి వెహికల్ వీడియోలతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని.. లాంటి స్టార్స్ చాలా మంది ఉన్నారు. ఇటీవలే బుజ్జి వెహికల లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా చేశారు.కల్కి సినిమా జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే సినిమా రిలీజ్ కి ఇంకో నెల రోజులు టైం ఉన్నా ఇంకా షూటింగ్ అవ్వలేదని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా కల్కి షూటింగ్ పూర్తయిందని సమాచారం. కల్కి సినిమాకు పనిచేసిన పలువురు సాంకేతిక సిబ్బంది షూట్ పూర్తయిందని తమ సోషల్ మీడియాలలో తెలిపారు. కల్కి షూట్ పూర్తయినందుకు మూవీ యూనిట్ ఇచ్చిన గిఫ్ట్స్ ఫోటోలు తీసి పోస్ట్ చేశారు.

bottom of page