top of page

🌸🌺 ఎండాకాలంలో చర్మ సౌందర్యం కాపాడుకోవటం ఎలా ?🍃🌞

👩‍⚕️ ఎండాకాలంలో చర్మాన్ని కాపాడుకోవడానికి ముఖ్యంగా మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి కొబ్బరి నీళ్లు, పళ్ళ రసాల వంటివి తాగాలి.

టమాటో, కీరా దోసకాయ, బొప్పాయి వంటివి తినటంతో పాటు కుదిరినప్పుడు వీటితో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఎండాకాలంలో ముఖం నిగారింపును సొంతం చేసుకోవడానికి ముఖానికి సరిపోయే విధంగా పండ్లతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ను వేసుకుంటే మంచిది. ఇక అప్పుడప్పుడు ఎండకు చర్మం నల్లబడితే ట్యాన్ పోయే విధంగా సహజ సిద్ధమైన ప్యాక్ లు వేసుకోవాలి. ఇంట్లో కూడా స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ వాడడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. 🚿💆‍♀️




bottom of page