top of page
Suresh D

స్మోకింగ్ మానేస్తే.. ఈ రోగాలు అన్నింటికి చెక్ పెట్టినట్లే🚭👨‍⚕️

ఈ అధ్యయనంలో ధూమపానం మానేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని 40 శాతం తగ్గించవచ్చని తేలింది.టైప్ 2 మధుమేహం దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధికి మందు లేదు.

మధుమేహం ముప్పు నానాటికి పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న వారి వరకు ఎవర్నీ ఈ షుగర్ వ్యాధి వదిలిపెట్టడం లేదు. దీనికి కారణం మన రోజువారీ జీవితమే. ఈ రోజుల్లో శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. ఎవరూ వ్యాయామం అనేది చేయడం లేదు. అదనంగా, కేలరీలు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటున్నారు. అధిక కేలరీల ఆహారం తినడం వల్ల మధుమేహం మాత్రమే కాకుండా ఇతర వ్యాధులు కూడా అటాక్ చేస్తున్నాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అధ్యయనంలో ధూమపానం మానేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని 40 శాతం తగ్గించవచ్చని తేలింది.

టైప్ 2 మధుమేహం దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధికి మందు లేదు. పూర్తి నివారణ లేదు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం, దీర్ఘకాలిక వ్యాధులలో 95 శాతం మధుమేహం ఉంది. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా వస్తుంది. COPD, డిమెన్షియా వంటి వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. మీరు ధూమపానం మానేస్తే, మీరు ఈ వ్యాధుల అన్నింటి నుంచి బయటపడవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణాలలో ధూమపానం ఒకటి. ప్రస్తుతం ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చాలా మంది చనిపోతున్నారు. 90% ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులకు ధూమపానం కారణం. COPD- ఈ వ్యాధి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఫలితంగా ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుంది. దాదాపు 85-90 శాతం COPD కేసులకు ధూమపానం ప్రధాన కారణం.🚭👨‍⚕️

బ్రెయిన్ స్ట్రోక్: రోజుకు 20 సిగరెట్లు తాగడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దూమపానం వదిలేయడం వల్ల ఈ రిస్క్ నుంచి కూడా బయటపడొచ్చు.👩‍⚕️🩺

bottom of page