రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రైలు రాజ్‌ఖర్స్వాన్ నుంచి బడాబాంబో వైపు వెళ్తున్న సమయంలో జార్ఖండ్‌లో రైలు ప్రమాదం జరిగింది. చక్రధర్‌పూర్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు మరో ట్రాక్‌పైకి గూడ్స్ రైలు బోగీలు ఒరిగిపోయాయి. ఇంతలో వెనుక నుంచి అదే లైన్ లోకి వచ్చిన హౌరా-ముంబై మెయిల్ బోగీలను ఢీకొంది. ప్రమాదంలో మొత్తం బోగీలు పట్టాలు తప్పాయి. అయితే హౌరా మెయిల్ డ్రైవర్ ఈ ప్రమాదాన్ని సకాలంలో గ్రహించాడు.. తెలివిగా వ్యవహరించి హోరా ముంబై రైలుకి జరగాల్సిన ఘోర ప్రమాదాన్ని నివారించినట్లు తెలుస్తోంది. డ్రైవర్ తెలివి కారణంగానే ప్రయాణీకులెవరూ మరణించలేదని తెలుస్తోంది. గతనెల 20వ తేదీన పశ్చిమ బెంగాల్‌లో దాదాపు ఇదే తరహా ప్రమాదం జరిగింది. కంచన్ జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో పదిమంది చనిపోయారు. ఆ ప్రమాదం జరిగి నెలరోజుల తర్వాత మళ్ళీ ఘోర రైలు ప్రమాదం జరిగింది.