top of page
Suresh D

ఎన్నికల దెబ్బ.. టాలీవుడ్‌ అబ్బా..🎥✨

టాలీవుడ్‌కు ఆల్రెడీ ఉన్న తలనొప్పులు చాలవన్నట్లు.. ఈసీ కూడా ఇప్పుడు ఇంకో పిడుగు వేసింది. అక్కడ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో లేదో.. నిర్మాతలకు కంటిమీద నిద్ర లేకుండా పోతుందిప్పుడు.

టాలీవుడ్‌కు ఆల్రెడీ ఉన్న తలనొప్పులు చాలవన్నట్లు.. ఈసీ కూడా ఇప్పుడు ఇంకో పిడుగు వేసింది. అక్కడ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో లేదో.. నిర్మాతలకు కంటిమీద నిద్ర లేకుండా పోతుందిప్పుడు. దెబ్బకి రిలీజ్ డేట్స్ మార్చుకోవాల్సి వచ్చేలా ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ టాలీవుడ్‌పై చూపించబోయే ప్రభావం ఎంత..? 

కొన్నాళ్లుగా తెలుగు ఇండస్ట్రీ ఆల్రెడీ సంప్‌లోనే ఉంది.. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ రావడంతో మరింత మునిగిపోయేలా కనిపిస్తుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రావడంతో నిర్మాతల్లో కంగారు మొదలైంది.  

ఎన్నికల షెడ్యూల్ కారణంగా మొదట బలయ్యే సినిమా కల్కి. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మే 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ మే 13న ఏపీ, తెలంగాణలో పోలింగ్ ఉంది. అంటే ఎలక్షన్ ఫీవర్ పీక్స్‌లో ఉండే టైమ్ అది. అప్పుడసలు సినిమా చూసే మూడ్‌లో ప్రేక్షకులు ఉంటారా అనేది డౌట్. అందుకే కచ్చితంగా పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.. 

మే 13న పోలింగ్.. జూన్ 4న కౌంటింగ్.. అంటే ఈ 20 రోజులు పొలిటికల్ ఫీవర్ తప్పదు. అందుకే కొత్త ప్రభుత్వం వచ్చేవరకు కొత్త సినిమాల్ని తీసుకురాకపోవడమే మంచిదనుకుంటున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీ మూవీ మేకర్స్. అయితే ఈ గ్యాప్‌లో ఎప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్.. మే 17న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రానున్నాయి. మొత్తానికి ఈసారి ఎన్నికలు ప్లస్ ఐపిఎల్ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతల ప్లానింగ్ పూర్తిగా డిస్టర్బ్ అయిపోయింది.🎥✨

bottom of page