top of page
Shiva YT

📱📡 సిమ్ కార్డ్‌ని ఎన్నిసార్లు పోర్ట్ చేయొచ్చు..

📲🌐 మొబైల్‌లో సిమ్, నెట్‌వర్క్, డేటా చాలా కీలకం. అయితే, కొన్ని సిమ్ కార్డ్స్‌ స్లో స్పీడ్, కొన్ని ప్రాంతాల్లో నెట్‌వర్క్ కవరేజీ లేకపోవడం, ఇతర కారణాల వల్ల వినియోగదారులు తమ మొబైల్ నెట్‌వర్క్‌ను పోర్ట్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

🔄📞 అంటే.. మొబైల్ నెంబర్‌ను మార్చకుండానే ఒక నెట్‌వర్క్ నుంచి మరొక నెట్‌వర్క్‌కు సేవలను మార్చుకోవడానికి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ సౌకర్యాన్ని అందిపుచ్చుకోవడం అన్నమాట.

📜🔒 ట్రాయ్‌ నిబంధనల ప్రకారం.. మీ మొబైల్ నంబర్‌ను కావలసినన్నిసార్లు పోర్ట్ చేసుకోవచ్చు. దీనికి నిర్దిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఇక కస్టమర్ ఎలాంటి సమస్యా లేకుండా మొబైల్ నంబర్‌ను సులభంగా పోర్ట్ చేయొచ్చు.

📡🔀 ఏదైనా నెట్‌వర్క్‌కి పోర్ట్ చేయాలంటే ప్రస్తుత నెట్‌వర్క్‌ను కనీసం 90 రోజులు అయినా వినియోగించాలి. దానికంటే ముందు గడువులో మరో నెట్‌వర్క్‌కు పోర్ట్ చేయడం సాధ్యం కాదు. అలాగే సిమ్ కార్డ్ హోల్డర్ యాజమాన్యాన్ని మరొక వ్యక్తికి బదిలీ చేసే ప్రక్రియలో ఉన్న సందర్భంలోనూ ఎంఎన్‌నీ సాధ్యం కాదు.


bottom of page