top of page
Shiva YT

🇮🇳🔒👩‍⚖️🧕📜యూనిఫాం సివిల్ కోడ్ (UCC)కు.. ముస్లిం మహిళలు ఎంతమంది మద్దతు ఇచ్చారంటే?

భారతదేశపు అతిపెద్ద యూనిఫాం సివిల్ కోడ్ (UCC) కోసం న్యూస్ 18 మెగా యుసీసీ పోల్‌ నిర్వహించింది. ఇందులో భాగంగా 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రత్యేకంగా సర్వే చేయబడిన 8,035 మంది ముస్లిం మహిళల్లో 5,403 మంది వివాహం, విడాకులు, దత్తత వారసత్వం కోసం ఉమ్మడి చట్టానికి మద్దతు ఇచ్చారు.🌟

కనీసం 67% ముస్లిం మహిళలు వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి వ్యక్తిగత విషయాల కోసం భారతీయులందరికీ ఉమ్మడి చట్టానికి మద్దతు ఇస్తున్నారని, న్యూస్18 నెట్‌వర్క్ ప్రత్యేకంగా నిర్వహించిన భారతదేశపు అతిపెద్ద యూనిఫాం🤝సివిల్ కోడ్ (UCC) సర్వేలో తేలింది. UCC గురించి ప్రస్తావించకుండానే, 884 News18 రిపోర్టర్లు దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో UCC కవర్ చేసే ఇతివృత్తాలపై 8,035 మంది ముస్లిం మహిళలను ఇంటర్వ్యూ చేశారు. సర్వేలో పాల్గొన్నవారు 18-65 వయస్సున్న వివిధ కేటగిరీలో ప్రాంతాలు, కమ్యూనిటీలు, 📊విద్యా, వైవాహిక స్థితి విద్యా అర్హతలు,👥 నిరక్షరాస్యుల నుండి పోస్ట్-గ్రాడ్యుయేట్ వరకు మహిళలు పాల్గొన్నారు.

bottom of page