top of page
MediaFx

ఇంట్లోనే స్వచ్ఛమైన కల్తీలేని కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు! ఎలాగంటే..


చర్మం అయినా, జుట్టు అయినా - సౌందర్య సంరక్షణలో కొబ్బరి నూనెకు ప్రత్యామ్నాయం లేదు. ఇప్పటికీ అమ్మమ్మలు, నానమ్మలు చర్మానికి కొబ్బరి నూనెను వినియోగిస్తుంటారు. కొబ్బరి నూనెలో వివిధ రకాల విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది చర్మం, జుట్టు రెండింటికీ మేలు చేస్తాయి. దెబ్బతిన్న జుట్టు, చర్మాలకు కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల చికిత్స అందిస్తుంది.

కొబ్బరి నూనెను జుట్టు మూలాల నుంచి పట్టించడం ద్వారా కురులకు పోషకాలు అందించేందుకు వీలుంటుంది. జుట్టుకు కొబ్బరి నూనెను రెగ్యులర్ అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు గరుకుదనం కూడా కొబ్బరి నూనెతో సులభంగా తొలగిపోతుంది.

కొబ్బరి నూనెను చర్మానికి క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా, హైడ్రేట్ గా ఉంటుంది. ముఖానికి కూడా కొబ్బరి నూనెను కూడా రాసుకోవచ్చు. కానీ కొబ్బరి నూనె కల్తీలేకుండా స్వచ్ఛంగా ఉండాలి. లేకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు.

కొబ్బరినూనె మార్కెట్‌లో పుష్కలంగా లభిస్తుంది. అయితే అవన్నీ ప్రామాణికమైనవి, స్వచ్ఛమైనవి కాకపోవచ్చు. ఇలాంటప్పుడు కొబ్బరి నూనెను ఉపయోగించకుండా, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కొబ్బరికాయల నుంచి కొబ్బరిని వేరు చేయాలి. కొబ్బరి పాలు తీసి, అందులో వేడి నీటిని కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని బాగా చిలక్కోట్టాలి. అనంతరం కొబ్బరి పాలను వడకట్టాలి.

కొబ్బరి పాలను 7-8 గంటలపాటు రాత్రిపూట మూతపెట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల కొబ్బరి పాలు గడ్డకడుతాయి. తర్వాత ఈ పెరుగు పాలను తక్కువ వేడి మీద వేడి చేయాలి. పాలు మరుగుతున్నప్పుడు నూనె పైకి తేలడం కనిపిస్తుంది. కాసేపటికి పాలు మరిగిన తర్వాత నూనె విడిపోయినట్లు కనిపిస్తుంది. ఆ నూనెను ప్రత్యేకంగా సీసాలో వేరు చేసుకోవాలి. ఇలా స్వచ్ఛమైన కొబ్బరి నూనెను తయారు చేస్తారు.

bottom of page