top of page

వాటర్ బాటిల్‌ ఎంత పని చేసింది..


కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ బస్సు విధ్వంసం సృష్టించింది. అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికిగాయాలు కాగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వివరాల్లోకి వెళితే. ఓ ఓల్వో బస్సు బెంగళూరు సిటీలోని ఓ ఫ్లై ఓవర్‌ పైన్‌ నుంచి వెళ్తోంది. అయితే అదే సమయంలో వాహనం ఒక్కసారిగా డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయింది. ట్రాఫిక్‌లో బ్రేక్‌ పడకపోవడంతో బస్సు ఎదురుగా ఉన్న వాహనాల మీదికి దూసుకుపోయింది. అసలు ఏం జరిగిందో తెలియక డ్రైవర్ కాసింత గందగరోళానికి గురయ్యాడు. దీంతో వెంటనే మస్సులో ఉన్న డ్రైవర్‌ వచ్చి. ఏమైంది బ్రేక్‌ ఎందుకు వేయడం లేదన్నట్లు సైగ చేశాడు. ఇదంతా బస్సులో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. అయితే బస్సు వేగం తక్కువగా ఉండడంతో పెద్ద ప్రాణ నష్టం జరగలేదని చెప్పాలి. పొరపాటున బస్సు వేగంలో ఉండుంటే నష్టం మాటల్లో చెప్పడం కష్టం. అయితే బ్రేక్‌ పెడల్‌ కింద ఒక వాటర్‌ బాటిల్ వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఇదంతా బస్సులో ఉన్న సీసీటీవీలో రికార్డ్‌ అయ్యింది. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ్‌ వైరల్‌ అవుతోంది. ఈ ప్రమాదంపైకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు, అసలు కారణం ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page