top of page
MediaFx

ఎంత ధైర్యం మావా నీకు..


పాములంటే అందరికీ భయం. పామును దూరం నుంచి చూస్తూనే చాలు.. దెబ్బకు పరుగులు పెడతాం. సాధారణంగా పాములంటే దడుసుకుంటారు కొందరు. అలాంటిది కొండచిలువ అయితే.. ఇంకేమైనా ఉందా.. పైప్రాణాలు పైకి పోయినట్టే. దూరం నుంచి కొండచిలువను చూశామంటేనే చేతులు, కాళ్లు వణికిపోతాయి. కొండచిలువలు జంతువులనే కాకుండా మనుషులను కూడా అమాంతం మింగేస్తాయి. అయితే ఇక్కడొక వ్యక్తి ఏకంగా భారీ కొండచిలువకు స్నానం చేయించాడు. ఇక అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్‌ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి తన మెడలో భారీ కొండచిలువను పట్టుకుని బాత్రూంలో భయం లేకుండా ఎంచక్కా స్నానం చేయించాడు. ఈ వీడియోను ‘world_of_snakes’ అనే ఇన్‌స్టా హ్యాండిల్ ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసింది. బాత్రూమ్‌లో షవర్ కింద నిల్చుని తాను స్నానం చేయడమే కాదు.. శరీరంపై ఓ పెద్ద కొండచిలువను ఉంచుకుని జలకాలాటలు ఆడాడు. ఇక అతడి ముఖం ఎలాంటి భయం లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. దీనికి లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ ఆ వీడియోపై లుక్కేయండి.



bottom of page