top of page

నేటి రాశి ఫలాలు.. వీరికి గృహ కొనుగోలు ప్రయత్నాలు అనుకూలం✨🔮

ఫిబ్రవరి 8, 2024 నాటి రాశి ఫలాలు మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలను పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు.✨🔮

మేషరాశి

మేషరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. పట్టుదలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. స్థిరాస్తి వివాదాలు మరింత ముదిరే అవకాశాలున్నాయి. ప్రతి నిర్ణయంలోను మరింత నిదానం పాటించాలి. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు వాయిదావేస్తారు. తరచూ ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులు ఆశించిన లాభాలు రాకున్నా వెనుకంజ వేయరు. ఉద్యోగులకు మార్పులు తప్పనిసరి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు పర్యటనలు మధ్యలో వాయిదాపడతాయి. ఆకస్మిక ధనలాభం. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభరాశి

వృషభరాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. క్రీడాకారులకు గుర్తింపు వస్తుంది. వాహనాలు, గృహ కొనుగోలు ప్రయత్నాలు అనుకూలం. అవసరాలకు తగినంతగా సొమ్ము అందుతుంది. వ్యాపారులకు లాభాలు. వ్యవసాయదారులకు అనుకూలం. ఉద్యోగావకాశాలు వస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మిథునరాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు. బాధ్యతలు మీదపడినా ఆందోళన చెందక ముందుకు సాగుతారు. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. ఒక సమాచారం ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడులకు తొందరపడకుండా నిదానం పాటించాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయం. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని తాంబూలం శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

కర్కాటకరాశి

కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు అనుకూలంగా ఉన్నవి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. ఆత్మీయులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలు దక్కించుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు లాభాలు, ఉద్యోగులకు ప్రశంసలు దక్కుతాయి. క్రీడాకారులకు అనుకూల సమయం. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తాలగి శుభఫలితాలు కలుగుతాయి.

సింహరాశి

సింహరాశి వారికి నేటి దిన ఫలాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యమైన పనులను పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలకు తగిన సమయం. అందరిలోనూ కీర్తి ప్రతిష్టలు దక్తుకాయి. కుటుంబసభ్యులు సైతం మీపై ప్రేమానురాగాలు చూపుతారు. ఆస్తుల వ్యవహారంలో నూతన అగ్రిమెంట్లు. వాహనయోగం. విద్య, ఉద్యోగావకాశాలు దక్కే అవకాశం. ఆరోగ్యపరంగా ఉపశమనం పొందుతారు. అదనపు ఆదాయం సైతం దక్కుతుంది. వ్యాపారులకు లాభాలు మరింత ఊరటనిస్తాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అలసట, పని ఒత్తిళ్ళ నుంచి విముక్తి పొందుతారు. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఇంటిలో శుభపరిణామాలు ఉత్సాహాన్నిస్తాయి. నేర్పుతో కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు. రాబడి పెరుగుతుంది. విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. కోర్టు వ్యవహారాలలో కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరే సమయం. కన్యారాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

తులారాశి

తులారాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు మధ్యస్థంగా ఉన్నాయి. ముఖ్యపనులను నేర్పుగా పూర్తిచేస్తారు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారంతో ఊపిరి పీల్చుకుంటారు. విద్యార్థులకు ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విదేశీ విద్యావకాశాల కోసం చేసే కృషి ఫలిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో రాజీమార్గం అనుసరిస్తారు. వ్యాపారులు లాభనష్టాలను సమానంగా స్వీకరించాల్సి వస్తుంది. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. ఇష్టదైవ ప్రార్థన చేయండి. అంతా మంచే జరుగుతుంది.

వృశ్చికరాశి

వృశ్చికరాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. రాబడికి లోటు ఉండదు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూల పరిస్థితులు. కుటుంబ పెద్దల సలహాలు స్వీకరిస్తారు. వారసత్వ ఆస్తులు దక్కుతాయి. వ్యాపారులు కష్టనష్టాల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు కొంత ఊరట లభిస్తుంది. ఐటీ రంగం వారికి అనూహ్యమైన ఆహ్వానాలు రావచ్చు. దూర ప్రాంతాల నుంచి అనుకూల సమాచారం వస్తుంది. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. నేర్పుతో వ్యవహరించవలసిన సమయం. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలలో అవాంతరాలు. అరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపటం మంచిది. కొన్ని ముఖ్య పనులు నెమ్మదిగానే పూర్తికాగలవు. వ్యాపారులు అనుకున్న లాభాలను పొందలేరు. ఉద్యోగులు అదనపు బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి. అకస్మిక ధనలాభం చూస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. శుభవర్తమానాలు ఉంటాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆలోచించి పనులు చేపడతారు. చాలాకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాదాలు రాకుండా చూసుకోవడం మంచిది. భూ లావాదేవీల్లో కాలయాపన ఉంటుంది. ఓపికతో సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. శుభకార్యాలకు హాజరవుతారు. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం, నేర్పుతో సమస్యలు అధిగమిస్తారు. బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. క్రీడా, అధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారులకు లాభాలు ఊరిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు తొలగుతాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఆదాయానికి లోటు ఉండదు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందడుగు వేస్తారు. వ్యాపారులకు లాభాలు, పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది. నూతన పరిచయాలతో ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం శనగలు దానమివ్వాలి. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

bottom of page