top of page
Suresh D

🌟 ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్..పూర్తి వివరాలు.. 📱

దీనిని ప్రస్తుతానికి చైనాలో ఆవిష్కరించగా.. యూకే సహా యూరోప్ లోని కొన్ని దేశాల్లో కూడా అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ఈ హానర్ మ్యాజిక్ వీ2 స్పెసిషికేషన్లు, ఫీచర్లు, ధర వంటి ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం..

టెక్ ప్రపంచంలో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో పోటీ వాతావరణం నెలకొంది. కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వేరియంట్లను లాంచ్ చేస్తున్నాయి. ప్రస్తుతం కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా లాంచ్ చేస్తున్నాయి. ఇప్పటి శామ్సంగ్, మోటోరోలా వంటి కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేశాయి. కాగా ఇప్పుడు వాటికి పోటీగా హానర్ కంపెనీ ఓ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పలుచని ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ గా కంపెనీ ప్రకటించుకుంది. కేవలం 9.9ఎంఎం థిక్ నెస్ ఉంటుందని చెప్పింది. మంచి స్పెసిఫికేషన్లు, ఆకట్టుకునే కెమెరాలు ఉంటాయని పేర్కొంది. దీని పేరు హానర్ మ్యాజిక్ వీ2. దీనిని ప్రస్తుతానికి చైనాలో ఆవిష్కరించగా.. యూకే సహా యూరోప్ లోని కొన్ని దేశాల్లో కూడా అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ఈ హానర్ మ్యాజిక్ వీ2 స్పెసిషికేషన్లు, ఫీచర్లు, ధర వంటి ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం..✨📱

హాజర్ మ్యాజిక్ వీ2 డిజైన్..✨📱

ఈ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో అతి సన్నని ఫోల్డబుల్ ఫోన్ కంపెనీ ప్రకటించింది. ఇది కేవలం 9.9 ఎంఎం మందంతోనే ఉంటుంది. గూగుల్ పిక్సల్ ఫోల్డ్ ఫోన్ మందం 12.1ఎంఎంగా ఉంటుంది. అదే సమయంలో వన్ ప్లస్ కన్నా కూడా ఈ ఫోన్ కేవలం 2ఎంఎం తక్కువగానే ఉంటుంది. దీంతో ఇది స్టైలిష్ గా కనపడటంతో పాటు వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది.

హాజర్ మ్యాజిక్ వీ2 డిస్ ప్లే..✨📱

ఈ ఫోల్డబుల్ ఫోన్లో విభిన్నమైన డిస్ ప్లే ఉంటుంది. దీని బయటవైపు స్క్రీన్ 6.43 అంగుళాలతో 120హెర్జ్ రిఫ్రెష్ రేటుతో ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందిస్తుంది. ఎల్టీపీఓ కవర్ స్క్రీన్ తో తో శక్తివంతమైన విజువల్స్ ను అందిస్తుంది. 20:9 యాస్పెక్ట్ రేషియో ఉంటుంది. 2,500నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ సంరక్షణకు నానో క్రిస్టల్ గ్లాస్ ప్రోటెక్షన్ 7.92 అంగుళాల ఎల్టీపీవో ఓఎల్ఈడీ ప్యానల్ ను కలిగి ఉంటుంది. 

హాజర్ మ్యాజిక్ వీ2 కెమెరా సిస్టమ్..✨📱

ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లో 16ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉంటాయి. వెనుకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 50ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 2.5x 20ఎంపీ టెలిఫోటో కెమెరాతో సహా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది.

హానర్ మ్యాజిక్ వీ2 ధర, లభ్యత..✨📱

ఈ హానర్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 16జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. బ్యాటరీ సామర్థ్యం కూడా 5000ఎంఏహెచ్ ఉంటుంది. ఇది డ్యూయల్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ. యూరోప్ లో దీని దర 1,699.99యూరోలుగా నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో రూ. 1,53,507.56గా ఉంటుంది. ఇది బ్లాక్ వేగన్ లెదర్, ఫాంటమ్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. వచ్చే నెల అంటే ఫిబ్రవరీ 2 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.

bottom of page