top of page

గౌరవ డాక్టరేట్ నిరాకరించిన సుదీప్..!


సుదీప్ చేసిన మంచి పనులకు తుమకూరు విశ్వ విద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. అయితే దీనిని కిచ్చా సుదీప్ నిరాకరించాడు. కిచ్చా సుదీప్ కు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సుదీప్ డాక్టరేట్ ఎందుకు నిరాకరించాడంటే.. కిచ్చా సుదీప్‌కు తుమకూరు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయాలని నిర్ణయించింది. వివి సిండికేట్ సమావేశంలో జరిగిన చర్చను సుదీప్ దృష్టికి తీసుకెళ్లారు. యూనివర్శిటీ నిర్ణయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపిన సుదీప్.. దానిని నిరాకరించాడు. ‘సమాజానికి సేవ చేసిన వాళ్లు నాకంటే పెద్దవాళ్లు చాలా మంది ఉన్నారు. వారికి డాక్టరేట్ ఇప్పించండి’ అని సుదీప్ అభ్యర్థించాడు. వినోదం, నటనతోపాటు సుదీప్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని సుదీప్ పీఏ ద్వారా పంపించారు. అయితే సుదీప్ మాత్రం దీనిని నిరాకరించారు. ఆగస్టు 17న తుమకూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానోత్సవం జరగనుంది. తుమకూరు యూనివర్సిటీ నుంచి ఈసారి ముగ్గురు గౌరవ డాక్టరేట్లను ప్రకటించారు. వాటర్ స్పోర్ట్స్ సాహసికుడు, సామాజిక కార్యకర్త సి.ఎస్. నాగనందన స్వామి, పారిశ్రామికవేత్త హెచ్. రాజన్నహళ్లి వాల్మీకి గురుపీఠానికి చెందిన జి.చంద్రశేఖర్, అలాగే వాల్మీకి ప్రసన్నానంద స్వామీజీలకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నారు.



Comments


bottom of page