top of page

🌟 తీవ్రవాదం పూర్తిగా నిర్మూలిస్తాం.. హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు 🌟

🔥 ఉగ్రవాదం, తీవ్రవాదం.. ఈ రెండూ అభివృద్ధికి గొడ్డలి పెట్టు. అశాంతి నెలకొన్న చోట ఏ పరిశ్రమలూ రావు, ఏ పెట్టుబడులూ రావు. అందుకే కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల భద్రతతో పాటు అంతర్గత భద్రతకు కూడా అంతే ప్రాధాన్యతనిస్తోంది.🌐

ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్’ పేరుతో ఉక్కుపాదం మోపి అణచివేస్తోంది. ప్రజా ఉద్యమాలతో మిళితమైన వామపక్ష తీవ్రవాదంపై బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తూ ఫలితాలు సాధిస్తోంది. ఎప్పటికప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో సమావేశాలు జరుపుతూ పురోగతిని సమీక్షిస్తోంది.🌍 ఆ క్రమంలో తాజాగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.🕚 ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో మూడు రాష్ట్రాల సీఎంలు ఏపీ సీఎం వైఎస్ జగన్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ పాల్గొన్నారు.👥 అలాగే కేంద్ర మంత్రులు నిత్యానంద్ రాయ్, అశ్విని చౌబే, అర్జున్ ముండా, దేవుసింగ్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్‌తో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భాల, కేంద్ర సాయుధ పోలీసు బలగాల ఉన్నతాధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.📢 వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల హోం మంత్రులు, ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వామపక్ష తీవ్రవాదానికి అడ్డుకట్టేందుకు అనుసరించాల్సిన బహుముఖ వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు. 🔥🌏📢🕚


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page