top of page

తెలంగాణాలో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ భారీ పెట్టుబడి.

తెలంగాణ లో సినీపరిశ్రమకు.. వినోద రంగానికి చెందిన అది పెద్ద సంస్థ రాబోతోంది. హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ.. తెలంగాణాలో పెట్టుబడులుపెట్టడానికి ముందుకు వచ్చింది.




త్వరలో హాలీవుడ్ హైదరాబాద్ లో ప్రత్యక్ష్యం కాబోతోంది.. అంతర్జాతీయ వినోద రంగానికి చెందిన ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తెలంగాణలో పెట్టుబడి పెట్టబోతుంది. పదుల సంఖ్యలో ఛానెల్స్.. టెలివిజన్.. ఫిల్మ్ కంటెంట్ కలిగిన వార్నర్ బ్రదర్స్ సంస్థ.. భారీ స్థాయిలో సినిమాలను కూడా నిర్మించింది. హాలీవుడ్ లో అగ్రగామిణిగా ఉన్న ఈ సంస్థ నుంచి హెచ్.బి.ఓ, హెచ్.బి.ఓ మ్యాక్స్, సిఎన్ఎన్, టి.ఎల్.సి, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్లుబి , యూరోస్పోర్ట్, యానిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్‌వర్క్, సినిమాక్స్, పోగో, టూన్ కార్ట్, హెచ్.జి.టీవీ లాంటి ఎన్నో ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన టెలివిజన్, ఫిల్మ్, స్ట్రీమింగ్, కంటెంట్ బ్రాండ్‌లు, ఫ్రాంచైజీ లు వార్నర్ బ్రదర్స్ బ్రాండ్ తో నడుస్తున్నాయి.అయితే సూపర్ ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న ఇండియాలో.. ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఎంటర్టైమెంట్ కు ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ తెలంగాణాలో పెట్టుబడులకు ముందుకు వచ్చింది. గేమింగ్,స్ట్రీమింగ్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ రంగంలో భారత మార్కెట్ లో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో హైదరాబాద్ లో డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటుచేసేందుకు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ముందుకొచ్చింది. ఇక ఈ సంరద్భంగా తమ విస్తరణ ప్రణాళికలలో భాగంగా మంత్రి కేటీఆర్ తో.. ఆసంస్థ ప్రతినిథులు చర్చించారు.ప్రస్తుతం న్యూయార్క్ పర్యటనల్ ఉన్నారు మంత్రి కేటిఆర్. అక్కడ ప్రతినిథులతో సమావేశం అయ్యారు. వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రతినిథులతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ విషయాన్ని స్వయంగా కేటిఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.ఇక ఈ సంస్థ ప్రతినిథులు కూడా ఈ ప్రతిపాదనపై మాట్లాడారు. మొదటి సంవత్సరం 1200 మందికి ఉపాధి కల్పిస్తామమని, వ్యాపారం పెరిగేకొద్ది మరింతమందికి అవకాశాలు కల్పిస్తామన్నారు వారు అన్నారు.ర్నర్ బ్రదర్స్ డిస్కవరీ తెలంగాణ వినోద రంగంలోకి ప్రవేశిస్తోంది. తెలంగాణ వినోద రంగంలోకి డిస్కవరీ రావ‌డం సంతోష‌క‌రమన్నారు. క్రియేటివిటీ, ఇన్నోవేష‌న్ హ‌బ్‌గా ఐడీసీ ని డిస్కవరీ ఏర్పాటు చేస్తోందని.. మొద‌టి ఏడాదిలోనే 1200 మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని కేటీఆర్ తెలిపారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థకు ప్రభుత్వం తరుపున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ప్రముఖ హాలీవుడ్ సంస్థ హైదరాబాద్ వస్తుండటంతో.. అంతటా హర్షం వ్యాక్తం చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ రంగంలో మరిన్ని అవకాశాలకు ఆస్కారం ఉండటంతో అంతా హ్యాపీ ఫీల్ అవుతున్నారు.

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page