top of page

చిరంజీవి సినిమా పేరుతో విజయ్ ఆంటోని..

విజయ్ ఆంటోని మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సినిమాకు ‘హిట్లర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. విజయ్ ఆంటోనీతో గతంలో ‘విజయ్ రాఘవన్’ మూవీని నిర్మించిన చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్‌గా ‘హిట్లర్’ చిత్రాన్ని నిర్మిస్తోంది.

పలు వైవిధ్యమైన సినిమాలతో తమిళ ప్రేక్షకులనే కాకుండా తెలుగు ఆడియన్స్‌ను కూడా అలరించారు హీరో విజయ్ ఆంటోని. ముఖ్యంగా ఆయన నటించిన ‘బిచ్చగాడు’ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాతోనే తెలుగులో విజయ్‌కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరవాత ఆయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది వచ్చిన ‘బిచ్చగాడు 2’ సైతం తమిళనాడులో కన్నా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ అయినా.. ఆ వెంటనే వచ్చిన ‘హత్య’ సినిమా నిరాశపరిచింది.

అయితే, ఇప్పుడు విజయ్ ఆంటోని మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సినిమాకు ‘హిట్లర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. విజయ్ ఆంటోనీతో గతంలో ‘విజయ్ రాఘవన్’ మూవీని నిర్మించిన చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్‌గా ‘హిట్లర్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. ‘హిట్లర్’ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page