🌄 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జులై నెలలో సంభవించిన భారీ వరద ఘటనను మరవకముందే మరోసారి ఆ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. 🌧️💧
వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగి పడడం వంటి ప్రకృతి ప్రకోపాల కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. 💔🏞️ వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. 113 చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి.. 🌩️☔ కుంభ వృష్టి, భారీ వరదలకు తోడు కొండ చరియలు విరిగి పడుతుండడంతో హిమాచల్ ప్రజలు ప్రాణాలను అరచేత పట్టుకుని బ్రతుకుతున్నారు. 🏞️❄️ ఈ సంవత్సరం పడిన భారీ వర్షాల ధాటికి కుల్లు సహా పాలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోతున్న కారణంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయింది. 🏔️
🌧️⚡ అటు మండి జిల్లాలోని దగ్గర క్లౌడ్‌బర్స్ట్ కారణంగా చిక్కుకు పోయిన 51 మందిని NDRF బృందాలు రక్షించాయి.. 🚒🚁 భారీ వర్షాలకు విద్యుత్ లైన్లు దెబ్బ తినడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. ⚡🏙️ కొండ చరియలు విరిగి పడి కులు-మండి హైవే పై వందలాది మంది నిలిచి పోయారు. 👨🚒🚓 హైవే పై చిక్కుకున్న వారిని హోటళ్లు, రెస్టారెంట్లు, నివాస సముదాయాల్లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు తరలించారు. 🏘️👥