🛫 విశాఖ విమానాశ్రయం అసలే డిఫెన్స్‌కు చెందినది కావడంతో అక్కడ భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. అలాంటి విమానాశ్రయంలో ఓ విమానం హైజాక్ గురైంది. ✈️
హైజాకర్లు హెచ్చరించడంతో ప్రయాణికులు అందరూ బెంబేలెత్తిపోతున్నారు. ⚠️ విమానం టేక్ ఆఫ్ కి సిద్ధంగా ఉంది. 🛬 విమానంలో ప్రయాణికుల ఒకటే అరుపులు కేకలు. 🚪 దీంతో సమాచారం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కి అందింది. 📞 అక్కడ నుంచి యుద్ధ ప్రాతిపదికన క్షణాల్లో భద్రతా దళాలకు ఆ సమాచారం చేరింది. 📢 ⚓️ వెంటనే నావికాదళం, విమానాశ్రయ భద్రతా బలగాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భద్రతా దళాలు క్షణం ఆలస్యం చేయకుండా రష్ అయ్యాయి. 💪 చాకచక్యంగా భద్రతా బలగాలు విమానాశ్రయంలోకి, అనంతరం విమానంలోకి చొచ్చుకు వెళ్లాయి. 🦸♂️ ప్రాణాలకు తెగించి భద్రతా బలగాలు హైజాకర్లపై ఒత్తిడి పెంచాయి. ⛑️ విమానం టేక్ ఆఫ్ కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో రన్వే మీద నిలిపివేయగలిగాయి. 🚁 ప్రయాణికుల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైజాకర్లని అదుపులోకి తీసుకోగలిగాయి. 🏃♂️ దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 😨 విమానాశ్రయంలో గురువారం సాయంత్రం జరిగిన ఈ దృశ్యాన్ని చూసిన వాళ్లు షాక్‌కి గురికాక తప్పదు. 😱
👮 ఆగండి ఆగండి.. ఇదంతా నిజం అనుకునేరు, ఇది ఒక మాక్ డ్రిల్ మాత్రమే. 💂 ఏదైనా విమానం హైజాక్ గురైనప్పుడు కానీ ఏదైనా భారీ ప్రమాదానికి గురై ప్రయాణికులు మృత్యువాత పడ్డప్పుడు తక్షణం భద్రత బలగాలు స్పందించాల్సిన తీరు, అనుసరించాల్సిన ఎసోపీ ల గురించి ఏటా అన్ని విమానాశ్రయంలో ఇలాంటి మాక్ డ్రిల్ లు నిర్వహిస్తుంటారు. 🌟 భద్రతా బలగాల సన్నద్ధత, సమర్థత వ్యూహాల, ప్రణాళిక ల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఇలాంటి మాక్ డ్రైవ్ లు దోహదం చేస్తుంటాయి. 💼🚦