top of page

హిడింబ రివ్యూ.. 🎥

హిడింబ అనే పదానికే ఎంతో చరిత్ర ఉంది. మహా భారతంలో హిడింబ అనే పదం వినే ఉంటారు. అయితే అంతటి ప్రాధాన్యం ఉన్న హిడింబను టైటిల్‌గా పెట్టే సరికి అందరిలోనూ ఇంట్రెస్ట్ కలిగింది. ఆ కథకు, వీరు చెప్పబోయే కథకు ఏమైనా లింక్ ఉంటుందా? అని ప్రేక్షకులు అనుకున్నారు. ఇక టీజర్, ట్రైలర్ అయితే అందరిలోనూ ఆసక్తిని పెంచేసింది. మరి అశ్విన్ బాబు ఈ హిడింబతో ఏం చేశాడు? ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం.

హిడింబ అనే పదానికే ఎంతో చరిత్ర ఉంది. మహా భారతంలో హిడింబ అనే పదం వినే ఉంటారు. అయితే అంతటి ప్రాధాన్యం ఉన్న హిడింబను టైటిల్‌గా పెట్టే సరికి అందరిలోనూ ఇంట్రెస్ట్ కలిగింది. ఆ కథకు, వీరు చెప్పబోయే కథకు ఏమైనా లింక్ ఉంటుందా? అని ప్రేక్షకులు అనుకున్నారు. ఇక టీజర్, ట్రైలర్ అయితే అందరిలోనూ ఆసక్తిని పెంచేసింది. మరి అశ్విన్ బాబు ఈ హిడింబతో ఏం చేశాడు? ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం.హిడింబ సినిమా కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తదే. నరమాంస భక్షకురాలు ప్రస్తుత సమాజంలోకి వస్తే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్ కొత్తగానే ఉంది. దాని కోసం సెటప్ చేసుకున్న థీమ్ కూడా బాగానే ఉంది. కాలాబండను ప్రశాంత్ నీల్ కేజీయఫ్ స్టైల్లో బాగానే డిజైన్ చేసుకున్నాడు. కానీ అంతగా వర్కౌట్ కాలేదు. అసలు ఈ కథను దర్శకుడు ఎలా చెప్పాలనే విషయంలోనే కన్ఫ్యూజ్ అయినట్టుగా, అలాంటి గందరగోళంలోనే సినిమా తీసేసినట్టు అనిపిస్తుంది.సినిమా చూసే ప్రేక్షకుడి మెదడులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. అసలు ఇది ఎందుకు ఇలా జరిగింది? ఆ టైంలో అలా ఉంటే.. మరి ఈ టైంలో ఇలా ఎందుకు ఉంది? అనే ప్రశ్నలు బోలెడన్న ఎదురవుతాయి. కథను ముందుకూ వెనక్కి తీసుకెళ్తూ చూపించాడని అనుకుంటే.. స్క్రీన్ ప్లే గానీ, కథ గానీ అలా అనిపించదు. అంతా కూడా ప్రజెంట్‌లోనే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కాన్సెప్ట్ వరకు కొత్తగానే అనిపించినా.. సినిమాగా తెరపై ఎక్కించడంలో దర్శకుడు తడబడ్డాడని ఇట్టే అర్థం అవుతోంది.ఆ తడబాటు ప్రేక్షకుల్లోనూ కలిగే అవకాశం ఉంది. సినిమా బాగుందే అని అనుకునేలోపు కొన్ని చిక్కు ప్రశ్నలు మెదడుని తడతాయి. లాజిక్స్ వదిలేసి సినిమాను చూస్తే పర్వాలేదనిపిస్తుంది. మొత్తానికి హిడింబ సినిమాను చూసి బయటకు వచ్చేటప్పుడు క్లైమాక్స్‌లోని ఆ ట్విస్ట్ ఊపిరినిస్తుంది.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page