top of page

హీరో సూర్య రూ.120 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కొన్నాడా..?


ఇప్పటివరకు తమిళంలో ఇలాంటి ప్రైవేట్ జెట్ ఏ నటుడు కొనుగోలు చేయలేదని.. కేవలం సూర్య మాత్రమే ఈ ప్రైవేట్ జెట్ సొంతం చేసుకున్నాడని టాక్ నడుస్తుంది. అయితే తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం సూర్య గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని.. అతడు ఎలాంటి ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయలేదని సూర్య సన్నిహితులు అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం సూర్య తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. సూర్య నటించిన కంగువ సినిమా అక్టోబర్ 10, 2024న థియేటర్లలోకి రానుంది. ఇక అదే రోజున రజినీకాంత్ నటించిన వేట్టైయాన్ సినిమా కూడా రిలీజ్ కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సూర్య వర్సెస్ రజినీ మధ్య పోటీ ఉండనుంది. కంగువ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని, యోగి బాబు, జగపతి బాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.



留言


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page