top of page
Suresh D

కార్తికేయ 3 పై బిగ్ అప్డేట్..🎥✨

2014లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన కార్తికేయ 2 కూడా మంచి విజయాన్ని నమోదుచేసుకున్న విషయం తెలిసిందే.

నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన కార్తికేయ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2014లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన కార్తికేయ 2 కూడా మంచి విజయాన్ని నమోదుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కేవలం తెలుగుతోనే కాకుండా బాలీవుడ్‌లోనూ మంచి విజయాన్ని అందుకుంది.చందు మొండేటి మార్క్‌ దర్శకత్వానికి ఫిదా అయ్యారు. దీంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా వసూళ్ల సునామిని సృష్టించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా క్లైమాక్స్‌లోనే కార్తికేయ 3 వస్తుందని మేకర్స్‌ హింట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికి మార్గం సుగుమం అయినట్లు తెలుస్తోంది. కార్తికేయ 3 చిత్రం మొదలవుతున్నట్లు తెలిపాడు హీరో నిఖిల్‌. ఈ విషయమై ట్వీట్ చేస్తూ.. ‘‘సరికొత్త అడ్వెంచర్‌ను సెర్చ్‌ చేసే పనిలో డాక్టర్‌ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో రానున్నాం’’ అని రాసుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. మరో అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ను చూసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.🎥✨

bottom of page