top of page
Shiva YT

మోదీ సభకు భారీ భద్రత

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాగర్ కర్నూల్ కు శనివారం మొదటిసారి వస్తుండటంతో ప్రజలలోనూ ఆసక్తి నెలకొంది. ప్రధాని మధ్యాహ్నం 12:00 గంటలకు నాగర్ కర్నూల్ కు రానున్నారు. పోలీసులు నాగర్ కర్నూల్ పెద్ద ఎత్తున మకాం వేశారు. సభను నలుగురు ఎస్పీల ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేస్తున్నారు. వీరితో పాటు ముగ్గురు అదనపు ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 28 మంది సీఐలతో పాటు 620 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు.


bottom of page