top of page
Shiva YT

🚨 ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రతా ఏర్పాట్లు

🌾 రైతుల ఛలో ఢిల్లీ కారణంగా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. రైతులు దూసుకొచ్చే అవకాశం ఉందని.. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 🏰


కాంక్రీట్‌ బ్లాక్‌లు, బారికేడ్లు, ఇనుప కంచెలు, కంటైనర్ల గోడలతో ఢిల్లీవైపు వచ్చే దారులు మూసివేశారు. 🌉 ఘాజీపూర్‌ సరిహద్దు దగ్గర భారీగా బలగాలను మోహరించారు. సింఘు, టిక్రి సరిహద్దులను క్లోజ్ చేశారు. 🚧 సరిహద్దులో రోడ్లపై పెద్ద సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. 🚓 వందలాదిగా సిమెంట్ దిమ్మల్ని అడ్డంగా పెట్టేశారు. అటు, రోడ్ల దిగువ నుంచి టాక్టర్లు రాకుండా జేసీబీలతో కందకాలు తవ్వించారు. 🚜 బోర్డర్‌లో భారీగా అంబులెన్స్‌లు కూడా ఏర్పాటు చేశారు. 🚑

🌍 శంభు బోర్డర్ దగ్గర 14 వేల మంది రైతులు ఉన్నారు. మొత్తం 12వందల ట్రాక్టర్లు, 300 కార్లు, 10 మినీ బస్సుల్లో రైతులు ఢిల్లీ బయల్దేరేందుకు సిద్ధం అయ్యారు. 🚚 దీంతో.. పంజాబ్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే ఉపేక్షించవద్దని సూచించింది. 🌾 రైతుల ముసుగులో సంఘవిద్రోహ శక్తులు అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని హెచ్చరించింది.🚨 రాళ్లు, భారీ యంత్రాలను శంభు బోర్డర్ వైపు తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది కేంద్ర హోంశాఖ. 🌐


bottom of page