top of page

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. 🌊 🏔️

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ☔️ దీంతో అన్నదాతలు పొలం పనులు ప్రారంభించారు.

మరోవైపు అశ్వరావుపేట, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి, జూలూరుపాడు, పాల్వంచ, సుజాతనగర్ తో పాటు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి మండలాలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. చెరువులు, జలాశయాలు.. కొత్త కలని సంతరించుకున్నాయి. 🌿 ఇదీ చదవండి: దక్షిణాసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతంపైన ఉన్న ఆలయం ఇదే..! 🏞️ ఇక ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా.. గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువైంది. దీంతో భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది.‌ జూలై 13 రాత్రికి 15 అడుగుల నీటిమట్టం చేరగా.. 14 రాత్రికి దాదాపు 20 అడుగుల నీటి మట్టానికి చేయడంతో గోదావరి ఘాట్ వద్దకు నీరు చేరింది. ఇదిలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్ నుంచి భారీగా వరద వచ్చి చేరు తోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా, 71. 80 మీటర్లకు చేరుకుందాి. దీంతో గేట్లు ఎత్తి 2,196 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రతీ ఏటా లాగే ఈ ఏడాది కూడా గోదావరికి వరదలు వస్తే.. సమర్థ వంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఇటివలే భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గోదావరికి వరదలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి పరి వాహక ప్రాంతంలోని అన్ని మండలాల్లో ఐదు నెలలకు సరిపడా నిత్యవసర సామగ్రి అందుబాటులో ఉంచాలని పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు. 🏔️🌊🌧️🌾🚜

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page