top of page

🔥 హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న ఏడుగురు కార్మికులు మృతి 🏭

హైదరాబాద్‌ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 🔥 బజార్‌ఘాట్‌లోని కెమికల్‌ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. 🔥

నాలుగు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. 🔍 మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. 💔 రంగంలోకి దిగిన అగ్నిమాకప సిబ్బంది.. 🔥 మూడు ఫైరింజిన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 🔥 రాకాశి మంటల్లో చిక్కుకొని ఏడుగురు కార్మికులు చనిపోయినట్లు ప్రాధమికంగా గుర్తించారు. 😢 ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నట్లు చెబుతున్నారు. 👩‍🚒 ఫైరింజిన్లతో మంటలు ఆర్పుతున్నప్పటికీ అదుపులోకి రాని ఆగ్నికీలలు. 🔥 ఇక్కడి పరిస్థితిపై దర్యాప్తు చేపట్టారు పోలీసు అధికారులు. 🚨 కమర్షియల్ కం రెసిడెన్సియల్ బిల్డింగ్‌గా గుర్తించారు. 🏢 గ్రౌండ్ ఫ్లోర్‌లో కార్ గ్యారేజ్ వద్ద ఉన్న డీజిల్ డ్రమ్ములు పేలి భారీగా మంటలకు కారణం అయింది. 🔍 సర్వీసింగ్‌కి వచ్చిన కార్లలోని డీజిల్‌ను డ్రమ్ముల్లో నిలువ ఉంచడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

గ్రౌండ్ ఫ్లోర్లో కంటే కూడా రెసిడెన్సియల్ ప్లేస్‌లో మంటలు క్షణాల వ్యవధిలో వ్యాపించినట్లు డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. 👨‍🚒 మొదటి అంతస్తులోని కొన్ని కుటుంబాలు చిన్న పిల్లలతో నివాసముంటున్నారు. 👨‍👩‍👧‍👦 వీరికి ఊపిరి ఆడక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. 👩‍⚕️ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. 👨‍⚖️ మంటలు అదుపులోకి వస్తే పరిస్థితిని అంచనా వేసేందుకు అవకాశం ఉండంటున్నారు లోకల్ డీసీపీ. 🏥 బిల్డింగ్ పర్మిషన్లపై కూడా ఓనర్లను సంప్రదించి చర్యలు చేపడతామంటున్నారు. 📑


Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page