top of page
MediaFx

తెలంగాణ సహా ఈ రాష్ట్రాలకు రెడ్​ అలర్ట్​!


భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. బయట అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. భారత వాతావరణశాఖ మరో ఆందోళనకర వార్త చెప్పింది. ఏప్రిల్ 30 వరకు దేశంలోని తూర్పు, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది.పశ్చిమ్​ బెంగాల్​లోని గంగా నది తీర ప్రాంతం, ఒడిశాతో పాటు కొన్ని రాష్ట్రాల్లో వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది.రానున్న నాలుగు రోజుల్లో బీహార్, ఝార్ఖండ్​, తెలంగాణ, రాయలసీమ, ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, తూర్పు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. 26-28 మధ్య కేరళ -మాహే; 2024 ఏప్రిల్ 28-29 తేదీల్లో కొంకణ్, గోవా, 28-30 తేదీల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని హెచ్చరించింది.


bottom of page