top of page
Shiva YT

కివీ పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..! 🥝🌿

మన దేశంలో సపోటా పండ్లతో కివీ పండ్లను పోల్చుతుంటారు. ఐతే... రెండింటి టేస్టూ వేరుగా ఉంటుంది. పోషకాలు కూడా వేరే. కివీ ఎందుకు తినాలో తెలుసుకుందాం. గుడ్డు సైజులో ఉండే కివీ ఫ్రూట్‌కి ఇప్పుడు ఇండియా భారీ మార్కెట్ అయిపోయింది.

న్యూజిలాండ్‌లో ఈ పండ్లు అలా పండుతాయో లేదో... ఇలా ఇండియాకి ఎగుమతి అయిపోతున్నాయి. ఆ వెంటనే ప్రజలు వాటిని కొనేస్తున్నారు. సాధారణంగా పండ్లలో గింజలుంటాయి. వాటిని తొలగించి తినాల్సిందే. కివీ పండులో కూడా గింజలు ఉన్నా... అవి అరటి పండులో గింజల్లా ఉంటాయి. అందువల్ల గింజలతో సహా తినేసే వీలు ఈ పండుకు ఉంది. తొక్కతో సహా తినవచ్చు గానీ... 99 శాతం మంది తొక్క తీసి తింటారు. తినేందుకు ఎంతో ఈజీగా ఉండటం వల్ల, రుచి కూడా ప్రత్యేకంగా ఉండటం వల్ల ఇండియాలో ఈ పండ్లను ఇప్పుడు బాగా ఇష్టంగా తింటున్నారు. ఇప్పుడు ప్రపంచపు వాణిజ్య పంటల్లో కివీ ఫ్రూట్ కూడా అత్యంత ముఖ్యమైన పంటగా మారిపోయింది. కివీ పండును జ్యూస్, జామ్, క్యాండీస్‌లో కూడా వాడుతున్నారు. చిత్రమేంటంటే ఈ పండు అంత పులుపుగా ఏమీ ఉండదు. కానీ... నిమ్మకాయలో కంటే ఇందులోనే ఎక్కువ విటమిన్ C ఉంటుంది. 100 గ్రాముల కివీలో 93 మిల్లీ గ్రాముల సీ విటమిన్ ఉంటుంది. అదే 100 నిమ్మకాయలో 54 మిల్లీగ్రాముల సీ విటమిన్ మాత్రమే ఉంటుంది. కివీ పండులో కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు ఈ పండును తింటే ఎంతో మేలు. విటమిన్ సీతోపాటూ ఇందులో విటమిన్ K, E ఉంటాయి. అలాగే ఆరోగ్యాన్ని కాపాడే ఫోలేట్, పొటాషియం ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. మన చర్మాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్స్... కివీ పండులో బాగా ఉంటాయి. అందువల్ల సూర్యరశ్మి, వాయు కాలుష్యం, పొగ వల్ల చర్మం పాడవకుండా ఉండేందుకు కివీ బాగా పనిచేస్తుంది. కివీలో ఫైబర్ కూడా ఎక్కువే. అందువల్ల మనం తినే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. మలబద్ధకం సమస్య తీరుతుంది. ఆస్తమా తగ్గేందుకు కూడా కివీ పండును ఉపయోగిస్తున్నారు. 🌿🍏🍊


bottom of page