top of page

సీరియస్ వార్నింగ్ ఇస్తున్న వైద్యులు.. ⚠️👩‍⚕️

కొన్నేళ్ల క్రితం నాటు వైద్యం వాడే వారు.. కానీ అప్పటి రోజులు అసలే కావు, అప్పుడు తీసుకున్న అహార అలవాట్లు వేరు ప్రస్తుతం మార్కెట్‌లో మనం తింటున్న ఫుడ్‌లో ఉన్న క్వాలిటీ వేరు.

దీని కారణంగా హెల్త్ సున్నితం అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో జ్వరం వచ్చినా, జలుబు చేసినా సొంత వైద్యంపై అధారపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగింది. అలా చేయడం ఫలితంగా అస్పత్రుల చుట్టు తిరగాల్సిన రోజులు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మనిషి లైఫ్ స్టైల్ బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అని చెప్పుకుంటున్నారు. కోవిడ్ భారిన పడిన వారు ఎదో ఒక సమస్యతో ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఉన్నారు. హెల్త్ పై కేర్ పెరిగినప్పటికి చాలా మందికి సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు.

ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మార్కెట్ లో వివిధ మెడికల్ షాపుల నుంచి షీట్ల కొద్ది ట్యాబ్లెట్టు కొంటున్న వారి సంఖ్య పెరిగినట్లు డాక్టర్లు చెబుతున్నారు. దీంతో ఏ రోగానికి ఏ మందు వాడాలి ఏ మోతాదులో వాడాలి అనేది సంబందిచిన డాక్టర్ ని కలిస్తే చెప్పే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సొంత వైద్యం, యూట్యూబ్ డైట్ ను ఫాలో అవుతున్న వారు అధికంగా హెల్త్ ఇష్యూతో బాధపడుతున్న వారు.. ఎక్కువ శాతం అస్పత్రులకు వస్తున్నట్లు చెబుతున్నారు. 💊🌡️


Comentários


bottom of page