శరీరం అంత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటుంది. అధిక బరువు సమస్య ఉండదు. అధిక మెటబాలిజం వలన మరింత శక్తివంతంగా ఉంటారు. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు జీవక్రియపై శ్రద్ధ వహించడం తప్పనిసరి.
🍏🍉 శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చడాన్ని జీవక్రియ అంటారు. ఆహారాన్ని జీర్ణం చేయడానికి, రక్త ప్రసరణ కోసం, శ్వాస, హార్మోన్ల సమతుల్యత వంటి పనుల కోసం, శరీరానికి ఆహారం నుండి లభించే శక్తి అవసరం. ఈ శక్తి జీవక్రియ నుండి వస్తుంది. మెటబాలిజం మెరుగ్గా ఉంటే, మీరు మరింత శక్తివంతంగా ఉంటారు.
😴🌅 రోజూ ఉదయాన్నే లేవాలి: ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజూ ఉదయాన్ని లేవాలి. కంటినిండా నిద్ర పోవాలి. సరిగ్గా నిద్రపోవడం వలన బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది. .. ఆరోగ్యకరమైన అల్పాహారం ఆహారాన్ని తీసుకోవాలి. 🏃♂️🏋️♀️ చాలా మంది ఎక్కువసేపు ఆఫీసుల్లోనే గడుపుతుంటారు. పని ఎక్కువ అవటం, ఇతర కారణాల కారణంగా అలసిపోతున్నారు. ఇలాంటి వారు వ్యాయామం చేయడానికి సమయం ఉండదు. ఈ కారణంగా మీ మెటబాలిజాన్ని మెరుగుపరచడానికి చురుకుగా ఉండేందుకు ప్రయత్నించాలి. పనిలో ఉన్నప్పుడు మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకోవాలి. అప్పుడప్పుడు కాసేపు నడవండి. దీని వల్ల బరువు తగ్గడమే కాకుండా పని మీద ఏకాగ్రత పెరుగుతుంది. మధ్యాహ్నం భోజనం పౌష్టికాహారం మాత్రమే తినండి. ఇక సాయంత్రం వేళలో చిప్స్, చాక్లెట్లు, కేకులు వంటి అస్సలు తినకండి.