top of page
Shiva YT

🍲🍹 డెంగ్యూ నుంచి వేగంగా కోలుకోవడానికి ఈ ఆహారాలు తీసుకోండి.. 🏥💧

డెంగ్యూ భారిన పడకుండా ఉండేందుకు ముందుగా నివారణ చర్యలు చేపట్టడం ఉత్తమం. ఒకవేళ డెంగ్యూ వచ్చినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 🌡️😌

🍈 బొప్పాయి ఆకు రసం: బొప్పాయి ఆకు రసం డెంగ్యూ జ్వరానికి ఒక ప్రసిద్ధ ఔషధం. బొప్పాయి ఆకు డెంగ్యూ జ్వరాన్ని సమర్థవర్ధంగా ఎదుర్కొంటుంది. అంతేకాకుండా ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. త్వరగా కోలుకోవడానికి బొప్పాయి ఆకు రసాన్ని కొద్దిగా నీటిలో కలుపుకు రోజుకు రెండుసార్లు తాగాలి. 🥭🍹

🥒 కూరగాయల జ్యూస్: కూరగాయల్లో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవి శరీరానికి శక్తినిస్తాయి. పలు రకాల కూరగాయలన్నింటినీ కలిపి జ్యూస్ చేసుకుని తాగడం వల్ల శక్తి లభిస్తుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 🥦🍹 💧 మంచినీరు: డెంగ్యూ వచ్చినప్పుడు ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురవుతుంటారు. ఇలాంటి సమయంలో మంచినీరు బాగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజుకు శరీరానికి అవసరమైన నీటిని తప్పకుండా తాగాలి. 💦🍹 🍵 హెర్బల్ టీ: ఈ హెర్బల్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మెరుగైన ఆరోగ్యం కోసం అల్లం టీ, యాలకుల టీ, దాల్చిన చెక్క టీని చేసుకుని తాగొచ్చు. ఈ హెర్బల్ టీని, సాయంత్రం గానీ, ఉదయం గానీ తాగొచ్చు. ఇది డెంగ్యూ నుంచి కోలుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా హెర్బల్ టీ సువాసన మనస్సును రిఫ్రెష్ చేస్తుంది. 🍵😌

bottom of page