top of page
MediaFx

ఎక్కువ సమయం ఏసీలో ఉండటం ఆరోగ్యానికి హానికరమా? 😷🌡️


వేసవి వేడి పెరిగే కొద్దీ, గ్రామాలలో కూడా అనేకమంది తమ ఇళ్లల్లో ఏసీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఎక్కువ సమయం ఏసీ గదుల్లోనే ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

రాత్రి పూట ఏసీలు నిరంతరం నడుస్తుండటం వల్ల, ఆస్తమా లేదా అలెర్జీల వంటి శ్వాసకోశ సమస్యలు గల వ్యక్తులు దగ్గు, శ్వాస ఆడకపోవడం, ఛాతీలో కఫం, శ్వాసలోపం వంటి లక్షణాలు అనుభవించవచ్చు. నిమోనియా, లెజియోనేరిస్‌ వంటి శ్వాస సమస్యలు కూడా ఏర్పడవచ్చు.

ఏసీలు గాలిని చల్లబరుచుతూనే దానిలోని తేమను కూడా తీసేస్తాయి, దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య ఏర్పడి, అది కిడ్నీ రాళ్లు ఏర్పడటం, గుండెపోటు వంటి తీవ్ర ప్రమాదాలకు కారణం కావచ్చు. రాత్రంతా AC లో పడుకోవడం వల్ల చర్మం, కళ్ళు పొడిబారిపోయి, చర్మ సమస్యలకు దారితీయవచ్చు.

ఏసీ వాడకం వల్ల ప్రమాదాలను నివారించడానికి 26 డిగ్రీల సెల్సియస్‌లో ఏసీ టెంపరేచర్‌ను ఉంచుకోవడం, తరచుగా ఏసీలను క్లీన్ చేయడం మరియు సర్వీస్ చేయించడం ముఖ్యం.

bottom of page