top of page
Suresh D

కుటుంబంతో భోజనం చేస్తే ఆ రోగాలే రావంట..

నేటి ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. ఒత్తిడికి అనేక కారణాలున్నాయి.. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబం, సంబంధాల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు మొదలైన అనేక కారణాలు ఉండవచ్చు. మీరు ఒత్తిడికి లోనవుతున్నట్లయితే.. వైద్య నిపుణులు.. ఒత్తిడి రహితంగా మారడంలో మీకు సహాయపడే ఒక సూచనను ఇస్తున్నారు.

నేటి ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. ఒత్తిడికి అనేక కారణాలున్నాయి.. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబం, సంబంధాల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు మొదలైన అనేక కారణాలు ఉండవచ్చు. మీరు ఒత్తిడికి లోనవుతున్నట్లయితే.. వైద్య నిపుణులు.. ఒత్తిడి రహితంగా మారడంలో మీకు సహాయపడే ఒక సూచనను ఇస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని ఓ సర్వేలో తేలింది.కుటుంబంతో లేదా ఇష్టమైన వారితో కలిసి భోజనం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సర్వేలో తేలింది. అధ్యయనంలో కుటుంబ సమేతంగా వెయ్యి మందికి పైగా కుటుంబసభ్యులను చేర్చారు. ఈ క్రమంలో డిన్నర్, వారి కార్యాకలాపాలను పరిశోధిస్తూ.. వారిని పరీక్షించారు. ఈ సమయంలో కుటుంబంతో కలిసి భోజనం చేసేవారు లేదా వారితో రోజూ 15 నుంచి 20 నిమిషాలు గడిపేవారిలో ఒత్తిడి తగ్గుతుందని వెల్లడైందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సర్వే తెలిపింది. సర్వేలో.. 91 శాతం మంది తల్లిదండ్రులు కలిసి ఆహారం తినడం వల్ల తమ కుటుంబంలో ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. అదే సమయంలో, 84 శాతం మంది ఒత్తిడిని నివారించడానికి, ప్రతి రోజు తమ కుటుంబంతో గడపాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. అంతేకాకుండా.. ఆరోగ్యం విషయంలో పలు మార్పులను కూడా గమనించినట్లు తెలిపారు.

bottom of page