top of page
MediaFx

గ్యాస్‌ సమస్యకు ట్యాబ్లెట్స్‌ వాడుతున్నారా.?

మారుతోన్న జీవవ విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గ్యాస్‌ సమస్య బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా రాత్రుళ్లు ఆలస్యంగా భోజనం చేయడం, నీటిని తక్కువగా తాగడం, ఒత్తిడితో కూడుకున్న జీవనశైలి ఇవన్నీ జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమవుతున్నాయి. అలాగే జంక్ ఫుడ్ తినడం, ఎక్కువగా ఉప్పు తీసుకోవడం, బేకరీ ఐటమ్స్‌ తినడం, హోటల్‌ ఫుడ్ తీసుకోవడం కారణంగా గ్యాస్‌ సమస్య బాగా పెరుగుతుంది. అయితే గ్యాస్‌ సమస్యగా రాగానే చాలా మంది వెంటనే మెడికల్ షాప్‌కి వెళ్లి ట్యాబ్లెట్ తెచ్చి వేసుకుంటారు. మరీ ముఖ్యంగా ఉదయం పరగడపున ట్యాబ్లెట్ వేసుకోవడం అలవాటుగా మార్చుకుంటారు. ఇలా ప్రతీ రోజూ ట్యాబ్లెట్ వేసుకోవడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని చెబుతున్నారు.

ట్యాబ్లెట్స్‌ను వేసుకోవడం వల్ల కొందరిలో అతిసారం సమస్య తలెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే నోరు పొడిబారడం, అపానవాయువు ఎక్కువగా రావడం, కడుపులో గ్యాస్‌ ఏర్పడడం, వెన్నునొప్పి, బలహీనత వంటి లక్షణాలన్నీ గ్యాస్‌ సమస్య ఉపశమనానికి ఉపయోగించే ట్యాబ్లెట్స్‌ వల్ల కలిగే సైడ్‌ ఎఫెక్ట్స్‌గా చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు సహజ పద్ధతుల్లోనే గ్యాస్‌ సమస్యను తగ్గించుకోవాలి. ఇంతకీ సహజ పద్ధతుల్లో గ్యాస్‌ సమస్యకు ఎలా చెక్‌ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్‌ సమస్యను తగ్గించడంలో సోంపు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అన్నం తిన్న వెంటనే సోంపు తీసుకుంటే తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుందని చెబుతున్నారు. ఉదయం నిద్రలేవగానే సోంపు తీసుకున్న మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆహారం ఒకేసారి అధిక మోతాదులో కాకుండా కొంచెం కొంచెం ఎక్కువసార్లు తీసుకోవాలని చెబుతున్నారు. తీసుకునే ఆహారంలో కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, లస్సీ, పెరుగు వంటివి తరచుగా తీసుకోవాలి. తిన్నవెంటనే నిద్రపోకూడదు, అలాగే రాత్రి కచ్చితంగా 7 నుంచి 8 గంటల నిద్ర ఉండాలని సూచిస్తున్నారు.

Comments

Couldn’t Load Comments
It looks like there was a technical problem. Try reconnecting or refreshing the page.
bottom of page