🏥 ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు, మినరల్స్, పోషకాలు అవసరం. ముఖ్యంగా విటమిన్ ఎ, బి, సి, డిలతోపాటు విటమిన్ కె కూడా మన శరీరానికి చాలా అవసరం. 💪
🩸 విటమిన్ K ప్రధానంగా రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. అలాగే కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడేవారు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. 🌿
🦴 అలాగే విటమిన్ K2 బలమైన ఎముకలను నిర్మించడంలోనూ సహాయపడుతుంది. విటమిన్ K శరీరంలో ఊపిరితిత్తుల పనితీరుతో సంబంధం కలిగి ఉంటుంది. 🌞
🚑 అందువల్లనే విటమిన్ కె లోపం ఏర్పడినప్పుడు ముకల ఆరోగ్యంతో పాటు ఆస్తమా, సీఓపీడీ వంటి మొదలైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 🌡️
🩸 విటమిన్ K లోపం ఉన్న వారి ఎముకలు చిన్న గాయానికే విపరీతంగా దెబ్బతింటాయి. ఒక్కోసారి ఎముకలు విరిగిపోతాయి కూడా. సాధారణంగా విటమిన్ కె లోపం బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది.
🪦 చర్మంపై నీలిరంగు మచ్చలు కనిపించినట్లయితే మీ శరీరంలో విటమిన్ K లోపం ఉన్నదని గ్రహించాలి. గుండె వేగం కూడా అకస్మాత్తుగా పెరుగుతుంది. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఋతుస్రావం సమయంలో స్త్రీలకు పొత్తి కడుపు భాగంలో విపరీతమైన నొప్పి ఉంటే విటమిన్ K లోపం ఉన్నట్లు అర్ధం. అలాగే ఈ విటమిన్ లోపం వల్ల ముక్కులో రక్తస్రావం కూడా అవుతుంది. 💉