top of page
Shiva YT

ఈ సూపర్ ఫుడ్స్ మీకు జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి.. 🥦🍇

మీరు పదేపదే దగ్గు, జలుబు సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు దాని నుండి ఉపశమనం పొందడానికి అల్లం ఉపయోగించవచ్చు. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కఫాన్ని తొలగించడంలో సహాయపడతాయి. అల్లంలో యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది మన ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. రోగాలతో పారాడేలా చేస్తుంది.

బ్రకోలిని పోషకాల్ పవర్‌హౌస్‌గా పిలుస్తారు. బలమైన రోగనిరోధక శక్తిని నిర్మించడంలో బ్రకోలి ఎంతగానో సహాయపడుతుంది. ఈ ఆకుపచ్చ కూరల్లో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ ఈ, ఫైబర్ అధికంగా ఉంటుంది. యాంటిఆక్సిడెంట్స్ కూడా అధికం. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

నిమ్మ, బత్తాయి, పైనాపిల్ వంటి సిట్రస్‌ పండ్లు మీకు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పైనాపిల్‌ పండులో పండు చాలా జ్యుసిగా ఉంటుంది. ఈ పండులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కఫాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది.

బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి.

శరీరంలో కఫం ఎక్కువగా ఉండి, దాన్ని వదిలించుకోవాలంటే ఆర్ద్రీకరణ అవసరం. దోసకాయలలో నీరు పుష్కలంగా ఉంటుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 🥬🍓🍋

bottom of page