top of page
Shiva YT

ప్రైవేట్ భాగాలలో దురద లేదా మంట ఉందా..🚻

ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నీరు చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రతిరోజూ 8 గ్లాసులు లేదా 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. శరీరంలో నీరు లేనప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మలబద్ధకం, అజీర్ణం వంటి అనేక సమస్యలు శరీరంలో పెరుగుతాయని ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు అజయ్ కుమార్ చెబుతున్నారు. అలానే ముఖంపై మొటిమలు రావడం ప్రారంభిస్తాయి. డిహైడ్రేషన్ కారణంగా మూత్రపిండాలపై ఒత్తిడి పడుతుంది.

ముదురు పసుపు రంగు మూత్రం: 🟡

శరీరంలో నీరు లేకపోవడం వల్ల మూత్రం ముదురు పసుపు రంగులోకి మారుతుంది. కాబట్టి, ఈ రంగంలో యూరిన్ ఎక్కువ వస్తుంటే.. బాగా వాటర్ తీసుకోండి 💧

ముఖం మీద మొటిమలు: 😞

నీరు లేకపోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ పెరుగుతాయి. దీని వల్ల ముఖంపై మొటిమలు రావడం ప్రారంభమవుతాయి. ఈ సమస్య ఉన్నట్లయితే నీరు బాగా తాగండి. 💦

ప్రైవేట్ భాగాలలో దురద లేదా మంట: 🩲

డీ హైడ్రేషన్ వల్ల ప్రైవేట్ పార్ట్‌లలో దురద, మంట ఉంటుంది. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే జరిగితే.. మూత్రవిసర్జన సమయంలో మంటను కలిగిస్తుంది. అందుకే వాటర్ బాగా తాగాలని డాక్టర్లు చెబుతారు. 💦

పొడి బారిన చర్మం: 🌿

డీహైడ్రేషన్ వల్ల చర్మం పొడిబారి నిర్జీవంగా తయారవుతుంది. చిన్న వయసులోనే ముడతలు రావడం మొదలవుతుంది. 🧴

కళ్ల కింద నల్లటి వలయాలు కనిపిస్తాయి: 👁️

నిద్ర లేకపోవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు వస్తాయన్నది అందరికీ తెలిసిన విషయంలో. అలానే శరీరంలో డీహైడ్రేషన్, డీహైడ్రేషన్ కారణంగా నిత్యం తలనొప్పి వచ్చి.. ఇలా వలయాలు ఏర్పడతాయి. 👁️

కండరాల నొప్పులు: 🤕

నీటి కొరత కారణంగా, శరీర కండరాలు నొప్పి, తిమ్మిరి, దృఢత్వం కోల్పోవడం వంటి సమస్యలను ఎదురవుతాయి. 🤕

ఒత్తిడి, ఆందోళన: 😩

శరీంలో నీటి కొరత ఉంటే.. చాలా అలసటగా ఉంటుంది. అలానే మానిసిక ఒత్తిడి, చిరాకు వంటి సమస్యలు కూడా వస్తాయి. 😩

bottom of page