top of page

😴 గాఢ నిద్రలో ఉన్నవారిని గట్టిగా లేపటం ఎంత డేంజరో తెలుసా..?

😴 గాఢ నిద్రలోంచి అకస్మాత్తుగా మేల్కొనడం వారి ఆరోగ్యంపై లోతైన ప్రభావాన్ని చూపుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

ఈ చర్య వారి మానసిక సమతుల్యతను ప్రభావితం చేయడమే కాకుండా వారి జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యం, అభిజ్ఞా అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావాలను కలిగిస్తుంది. నిజానికి మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు చాలా చురుకుగా పని చేస్తుంది. నిద్రలో, మెదడు శరీర కణాలను సరిచేయడం, కొత్త జ్ఞాపకాలను నిల్వ చేయడం వంటి అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. మనం అకస్మాత్తుగా నిద్రలేచినట్లయితే, మెదడుపై ఒత్తిడి కలుగుతుంది. దాంతో అది పని చేయకుండా ఆగిపోతుంది.

మెదడుపై కలిగే ఒత్తిడి వల్ల మెదడులోని రక్తనాళాల్లో పగుళ్లు ఏర్పడి రక్తస్రావం మొదలవుతుంది. దీనిని బ్రెయిన్ హెమరేజ్ అంటారు. కొన్నిసార్లు మెదడు చాలా తీవ్రంగా దెబ్బతింటుంది. అలాంటి పరిణామాల కారణంగా ఆ వ్యక్తి వికలాంగుడిగా మారటం లేదంటే చనిపోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందువల్ల, ఎవరైనా గాఢ నిద్రలో ఉండగా మీరు వారిని అకస్మాత్తుగా లేపకూడదని చెబుతున్నారు. వారిని మెల్లగా కదిలించి లేపాలి. లేదంటే, కాస్త మీ స్వరం పెంచి పిలవటం మంచిదని సూచిస్తున్నారు. 🛌💤

Comentários


bottom of page