సాధారణంగా సిట్రస్ పండ్లు పుల్లగా ఉంటాయి. భోజనం చేసిన వెంటనే సిట్రస్ పండ్లు తింటే.. జీర్ణక్రియకు అంతరాయకం కలుగుతుంది. అమ్లత్వం కడుపులో అసౌకర్యం కలుగుతుంది. అన్నం తిన్న వెంటనే సిట్రస్ పండ్లను తింటే.. అజీర్ణం లేదా గుండెల్లో మంటకు కారణం అవుతుంది. 🚫
సింట్రస్ పండ్లలో కొన్ని సమ్మేళనాలు.. భోజనం తర్వాత వీటిని తింటే నిర్ధిష్ట పోషకాలను గ్రహించడంలో ఆటంకం ఏర్పడు అవకాశం ఉంటుంది. సిట్రస్ పండ్లలోని సమ్మేళనాలు పాలీఫెనాల్స్, టానిన్లు, ఆక్సలేట్‌లను కలిగి ఉంటాయి. భోజనం చేసిన తర్వాత వీటిని తింటే ఐరన్, ఖనిజాలు, కాంప్లెక్స్, కాల్షియం శోషణను తగ్గిస్తుంది. 💊
సిట్రస్ పండల్లో సహజ చక్కెరలు భోజనం తర్వాత వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడానికి, పడిపోవడానికి దారితీస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. 💉
భోజనం చేసిన వెంటనే సిట్రస్ పండ్లు తింటే కొందరిలో ఉబ్బరం లేదా గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో ఎక్కువగా అసౌకర్యం ఉంటుంది. 😖