🤔 ఈ క్యాన్సర్ 50 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో వస్తుంది. ఈ క్యాన్సర్ లక్షణాలను తేలికగా గుర్తించవచ్చు. ఒక వ్యక్తికి మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది పడటం, తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరిక, ముఖ్యంగా రాత్రిపూట నొప్పి లేదా మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపిస్తే, అది ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఉండవచ్చు. అలాగే మూత్రం, వీర్యంలో రక్తం రావడం.
🩹మూత్ర విసర్జన నెమ్మదిగా, బలహీనంగా ఉన్నప్పుడు మూత్ర విసర్జనలో మార్పులు ఉంటాయి. అవి, మూత్ర విసర్జనలో ఇబ్బంది, మెల్లిగా మూత్రం విసర్జించడం, కొందరు సంకోచాలని కూడా గమనిస్తారు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారికి మూత్ర విసర్జనలో ఎలాంటి సమ్యలు ఉండవు. ఇవి కనిపిస్తే క్యాన్సర్‌కు చెక్ పెట్టాలి. సకాలంలో చెక్ చేయించుకోవడం ద్వారా సులువుగా నయం చేసుకోవచ్చు. ఇలాంటి లక్షణాలు ఏవైనా కనిపించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదంటున్నారు నిపుణులు. లేకుంటే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది.
💡 ఇది ఎలా నిర్ధారణ అవుతుంది?
👨⚕️ ఈ వ్యాధి నిర్ధారణకు యూరాలజిస్ట్ పరీక్షలు చేయడం వల్ల తెలుసుకోవచ్చు. ఇది కాకుండా రక్త పరీక్ష (సీరం, PSA), సోనోగ్రఫీ ప్రాథమిక స్క్రీనింగ్ పద్ధతులు. అనుమానాస్పద సందర్భాల్లో ప్రోస్టేట్ ఎంఆర్‌ఐ, ప్రోస్టేట్‌కు చెందిన బయాప్సీ చేయబడుతుంది. 🩺💉📋