🦟 డెంగ్యూ దోమలు పగటిపూట ఎక్కువగా కుడతాయి. ఇవి పగటిపూట చాలా చురుకుగా ఉంటాయి. ☀️ సూర్యోదయం తర్వాత రెండు గంటల వరకు, అలాగే సూర్యాస్తమయానికి కొన్ని గంటల ముందు వరకు ఈ దోమ కుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఆడ దోమలు మాత్రమే మనుషులను కుడతాయి. ఈడిస్ ఈజిప్టి దోమలు సాధారణంగా చల్లని లేదా నీడ ఉన్న ప్రదేశాలల్లో ఉంటాయి. 🏡🦟
ఈడిస్ ఈజిప్టి దోమలను ఎలా నివారించాలంటే..
1 ఇంటి లోపల లేదా మీ పరిసర ప్రాంతాల్లో నిల్వ నీరు లేకుండా చూసుకోవాలి.
2 మొక్కల కుండీల్లో నిల్వ నీరు ఉంటే మట్టి లేదా ఇసుకతో నింపాలి.
3 ఫుల్ స్లీవ్స్, లేత రంగు దుస్తులు ధరించాలి.
4 ఇళ్ల తలుపులు, కిటికీలను వీలైనంత వరకు మూసి ఉంచండి.
5 దోమల నివారణ క్రీములు, కాయిల్స్, దోమతెరలను క్రమం తప్పకుండా వినియోగించాలి. 💦👕🌼