top of page

🍬 చక్కెర తక్కువ తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..?

🍭 బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా చక్కెరకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో చక్కెర కెంటెంట్‌ ఎక్కువగా ఉంటే జీవక్రియ మందగిస్తుంది. ఫలితంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది. దీంతో సహజంగానే బరువు పెరుగుతారు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా చక్కెరను తగ్గించాలని సూచిస్తున్నారు. 🍯

షుగర్‌ను తక్కువగా తీసుకోవడం: షుగర్ వల్ల ఏర్పడే వాపు కొల్లాజెన్ కోల్పోవడానికి కారణమవుతుంది. అలాగే చర్మంపై మొటిమలు వస్తాయి. మీరు కూడా మొటిమల సమస్యతో బాధపడుతుంటే చక్కెర తీసుకోవాన్ని తగ్గించుకోండి. తేడా మీకే తెలుస్తుంది.

🍏 చక్కెరను ఇలా తగ్గించుకోండి:

చక్కెరను ఎక్కువగా తీసుకునే వారు దానికి బదులుగా.. నేచురల్‌ స్వీట్స్‌ను ఎంచుకోవాలి. ఇందుకోసం యాపిల్స్, బెర్రీలు లేదా నారింజ వంటి తాజా పండ్లను తీసుకోవాలి. మీ శరీరానికి నేచురల్‌ షుగర్‌ను అందిస్తాయి. ఇక ప్యాకేజ్డ్‌ ఫుడ్‌కి వెనకాల ఉండే లేబుల్స్‌ను ఒకసారి చెక్‌ చేయడం దానిపై సిరపల్‌ లేదా సుక్రోజ్‌ అనే రాసి ఉంటే వాటికి దూరంగా ఉండండి. ప్యాకేజ్డ్‌ ఫుడ్‌లో ఉప్పుతో పాటు చక్కెర కంటెంట్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. 🍏

bottom of page