top of page
Shiva YT

కాల్షియం అంటే చేపలే కాదు.. ఈ కూరగాయల్లో కూడా..

🥦 బ్రోకలీ కాల్షియంకు పెట్టింది పేరు. వీటిలో చేపల ద్వారా లభించే పోషకాలు ఉంటాయి. బ్రోకలీలో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఒక కప్పుడు వండి బ్రోకలీ కూరలో 45 mg కాల్షియం, కేలరీలు 35, కొవ్వు 0.4 గ్రా, కార్బోహైడ్రేట్ 7.2 గ్రా, ప్రోటీన్ 2.4 గ్రా ఉంటాయి. 🌱

వైట్‌ బీన్స్‌లో కూడా కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్లు, ఫైబర్‌ వంటి అవసరమైన ఖనిజాలు ఉంటాయి. ఎముకలకు కాల్షియం అధికంగా ఉండే అనేక ఆహారాలలో వైట్ బీన్స్ ఒకటి. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. 100 గ్రాముల తెల్ల బీన్స్‌లో కాల్షియం 90.2 గ్రాములు, కేలరీలు 139, కొవ్వు 0.4 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 25.2 గ్రాములు, ప్రోటీన్ 9.5 గ్రాములు ఉంటాయి. 🍲

సోయా నుంచి తయారు చేసే టోఫులో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుందుఇ. చేపలో కంటే ఎక్కువ కాల్షియం కంటెంట్‌ ఇందులో ఉండడం విశేషం. ఇది బలమైన ఎముకలకు కాల్షియం, మెగ్నీషియం రెండింటినీ అందిస్తాయి. వీటిలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రోటీన్లు ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 100 గ్రాముల టోఫులో కాల్షియం 282.7 mg, కేలరీలు 83, కొవ్వు 5.3 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 1.2 గ్రాములు, ప్రోటీన్ 10 గ్రాములు ఉంటాయి. 🥦

ఇక చియా గింజలు కూడా కాల్షియంకు పెట్టింది పేరు. ఇవి అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కేవలం కాల్షియం మాత్రమే కాకుండా వీటిలో.. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు ఉంటాయి. 100 గ్రాముల చియా విత్తనాల్లో కాల్షియం 63 మి.గ్రా, కేలరీలు 83, కొవ్వు 30.7 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 42.1 గ్రాములు, ప్రోటీన్ 16.5 గ్రాములు ఉంటాయి. 🌰🌿

bottom of page