top of page
Shiva YT

🍲 శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసే ఆహారాలు..

🏃‍♂️చలికాలంలో కొవ్వు పదార్థాలు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ కాలంలో మద్యం సేవించడం, మటన్‌ తినటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు మరింత పెరుగుతాయి. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. పైగా శీతాకాలంలో వ్యాయామం చేయడానికి అంతగా ఇష్టపడరు. అంతేకాకుండా శరీరం విటమిన్ డి లోపిస్తుంది. ఇది లిపిడ్ జీవక్రియను ప్రభావితం చేస్తుంది. శీతాకాలంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

🍲 చలికాలంలో ఈ 5 ఆహారాలను తినడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చు. ఉదయం పూట అల్పాహారం కోసం వోట్‌ మీల్ తీసుకోవచ్చు. ఇందులోని పీచు పదార్ధం చెడు లేదా ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్-తగ్గించే ఆహారాల్లో ఫైబర్-రిచ్ ఫుడ్స్ తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారు.

🍎 చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది. డ్రై ఫ్రూట్స్‌లో మల్టీ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బాదం, అత్తి పండ్లను, వాల్ నట్స్ వంటి పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. కానీ ఎక్కువగా తినకూడదు. అవకాడోలో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఈ పండు HDL లేదా మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.

🥗 ఈ కాలంలో పాలకూర, ముల్లంగి, బీట్‌రూట్‌ మొదలైన కూరగాయలు అధికంగా లభిస్తాయి. వీటితోపాటు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ, దుంపలు, క్యారెట్‌లు, బీన్స్.. ఈ రకమైన కూరగాయలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. 🌿

bottom of page