top of page
Shiva YT

‘మగవారిలో సంతానోత్పత్తిపై కోవిడ్‌ దుష్ప్రభావం..’🤰🦠

‘కోవిడ్‌ 19 ఇన్ఫెక్షన్‌ కారణంగా పురుషుల శుక్రకణాల నాణ్యతను దెబ్బతీసిందని అధ్యయనాలు చెప్పాయి. అయితే ఇది కేవలం తాత్కలికేమనని తాజాగా మరో అధ్యయనం తెలిపింది.

పురుషుల్లో సంతానోత్పత్తిపై కోవిడ్‌ 19 దీర్ఘకాలంగా ప్రభావం చూపుతుందని కొందరు అభిప్రాయాపడ్డారు. అయితే అలాంటి సమస్య ఉండదని, ఈ దుష్ప్రభావం కేవలం తాత్కలికేమనని నిపుణులు చెబుతున్నారు. చైనాకు చెందిన పరిశోధకుల బృందం చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది.

‘కోవిడ్‌ 19 ఇన్ఫెక్షన్‌ కారణంగా దీర్ఘకాలికంగా చూపిన ప్రభావాలపై పరిశోధనలు చేయడాన్ని పరిశోధకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా జూన్ 2022, జూలై 2023 85 మంది పురుషులను పరిగణలోకి తీసుకొని అధ్యయనం నిర్వహించారు. వీర్యాన్ని సేకరించి దానిపై పరిశోధనలు చేపట్టారు. కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌కు ముందు 6 నెలలలోపు, కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ తర్వాత 3 నెలలలోపు, కోవిడ్-19 నుంచి కోలుకున్న మూడు నుంచి ఆరు నెలల తర్వాత వీర్యాన్ని పరీక్షించి ఈ విషయాలను వెల్లడించారు. అయితే ఇన్ఫెక్షన్‌కి ముందుతో పోల్చితే.. ఇన్ఫెక్షన్‌ తర్వాత వీర్యకణాల ఏకాగ్రత, వీర్య కణాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. అయితే రికవరీ తర్వాత మళ్లీ స్పెర్మ్‌ కౌంట్‌ సాధారణ స్థితికి వచ్చినట్లు గమనించారు. 🦠🔍🔬

bottom of page