🍇 కృష్ణఫలం ప్రయోజనాలు ఇవే.. 🍇 ఫైబర్ మన పొట్టకు ప్రీబయోటిక్‌లా వ్యవహరిస్తుంది. కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తుంది. పొట్ట మంచిగా ఉంటే ఆరోగ్యం మీ గుప్పెట్లో ఉన్నట్లే.
🍇 శరీరంలోని ఫినాల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. తద్వారా దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా చేస్తుంది.
🍇 ఫైబర్ ఎక్కువ కనుక ఎక్కువసేపు కడుపు నిండినట్టు ఉంటుంది. ఆకలి ఎక్కువ కాదు. తద్వారా అనవసరమైన ఫుడ్ తీసుకోకుండా చేస్తుంది. పైగా మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
🍇 కృష్ణఫలం తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటుంది. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయులు వేగంగా పెరగవు. కావున డయాబెటిస్ బాధితులు కూడా తినొచ్చు.
🍇 పొటాషియం అపారం. ఇది గుండె ఆరోగ్యానికి మేలుచేస్తుంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకోకుండా నివారిస్తాయి.
🍇 కృష్ణఫలాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి, ఇతర మూలకాల కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 🍇🌿✨